VK. Sasikala: పేరు మార్చకోనున్న శశికళ.. ఆ జ్యోతిష్యుడి సలహాతో నిర్ణయం.. కారణమేంటంటే
తమిళనాట సంచలనం వీకే.శశికళ(VK.Sasikala) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలిగా వెలుగులోకి వచ్చిన శశికళ.. అన్నాడీఎంకే లో కీలక నేతగా మారారు. కానీ జయలలిత...
తమిళనాట సంచలనం వీకే.శశికళ(VK.Sasikala) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలిగా వెలుగులోకి వచ్చిన శశికళ.. అన్నాడీఎంకే లో కీలక నేతగా మారారు. కానీ జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లి వచ్చాక ఆమెకు పార్టీలో ఆశించిన స్థానం లభించలేదు. ప్రయత్నాలన్నీ విఫలం అవుతుండటంతో (Tamil Nadu)మేరు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు ఇలా చేయనున్నారని సమాచారం. శశికళ కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నందున వారి నియంత్రణలో ఉండాల్సిన పరిస్థితి శశికళకు ఏర్పడింది. ఆమెపై పలు కేసులు కూడా కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసులను ఎదుర్కొనేందుకు, ఆస్తులను కాపాడుకునేందుకు తన బంధువుల సాయం శశికళకు అవసరం. అంతే కాకుండా జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను తనకు సహాయకుడిగా నియమించుకునేందుకు పిలవగా..అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇలా వరస వైఫల్యాలు జరుగుతుండటంతో కారణాల గురుంచి జ్యోతిష్యుడి దగ్గర సలహా అడిగారు. ఆమె జాతకాన్ని చూసిన జ్యోతిష్యుడు పేరు, ఇంటిని మార్చాలని సలహా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌ను రంగంలోకి దించినా శశికళకు ప్రయోజనం లేకపోయింది. ఆశించిన స్థాయిలో దినకరన్ పార్టీ రాణించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న పార్టీ నాయకత్వంలో అలజడిని సృష్టించింది. ఈ వ్యూహంలో భాగంగానే ఏఐఏడీఎంకే నాయకులతో చర్చలూ జరిపారు.
జయ నెచ్చెలి శశికళ కాషాయ కండువా కప్పుకుంటారా.. అన్నాడీఎంకే పగ్గాల కోసమే వెయిట్ చేస్తారా.. చిన్నమ్మ అడుగులు ఎటు వైపు పడనున్నాయి.. ఇప్పుడిదే తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా చిన్నమ్మ అన్నాడీఎంకేలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ముఖ్య నేత ఎమ్మెల్యే నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ శశికళను అన్నాడీఎంకే చేర్చుకోకపోతే.. బీజేపీలో చేరినా ఆమెను ఆహ్వానించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శశికళ మా పార్టీలో చేరితో తమిళనాడులో బలమైన శక్తిగా ఎదుగుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి