Crime News: దారుణం.. కన్న తండ్రే కాటేశాడు.. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి..

వావివరసలు మరిచి అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై.. ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది.

Crime News: దారుణం.. కన్న తండ్రే కాటేశాడు.. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి..
Representational Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 08, 2022 | 1:11 PM

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కూతురి పాలిట మృగంలా మారాడు. తల్లి లేని బాలికను అనుక్షణం అండగా ఉండాల్సిన వాడే ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై..  ఓ రాక్షస తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. గురుసహాయ్‌గంజ్‌ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుసహాయ్‌గంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక సోమవారం రాత్రి తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక ఏడుపు విన్న అత్త.. కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు గురుసహాయ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి రాజ్‌కుమార్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. కాగా.. బాలిక పదేళ్ల క్రితమే తల్లి చనిపోగా అప్పట్నుంచి అదృశ్యమైన నిందితుడు (తండ్రి) నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న కూతురిపైనే ఈ దారుణానికి పాల్పడిన తండ్రిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..