AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Ramila Khadiya: నా అనుచరుడినే ఆపుతావా..? కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యే.. కేసు నమోదు

Rajasthan MLA Ramila Khadiya: డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజ‌స్థాన్‌లోని

MLA Ramila Khadiya: నా అనుచరుడినే ఆపుతావా..? కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యే.. కేసు నమోదు
Ramila Khadiya
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2021 | 8:44 AM

Share

Rajasthan MLA Ramila Khadiya: డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాజ‌స్థాన్‌లోని బ‌న్స్‌వారాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్ధ‌రాత్రి వేళ బైక్‌పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచ‌రుడిని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆపాడు. దీంతో ఆయన వెంట‌నే స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేయగా.. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కానిస్టేబుల్‌పై చేసుకుంది. దీంతో ఆమెపై పోలీసులు కేసు న‌మోదు చేసినట్లు ఎస్పీ కైలాశ్ సింగ్ తెలిపారు.

రాజ‌స్థాన్‌లోని బ‌న్స్‌వారాలో ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న కుశాల్ ఘర్ ఎమ్మెల్యే అనుచరుడిని కానిస్టేబుల్ మహేంద్ర నాథ్ ఆపాడు. అయితే.. తాను ఎమ్మెల్యే అనుచ‌రుడిన‌ని, త‌న‌నే ఆపుతావా అంటూ అతను గొడ‌వ‌కు దిగాడు. వెంట‌నే అతను కుశాల్ ఘర్ ఎమ్మెల్యే ర‌మిలా ఖ‌దియాకు ఫోన్‌చేశాడు. దీంతో ఆమె అక్క‌డికి చేరుకుని.. హెడ్‌కానిస్టేబుల్ మహేంద్ర‌నాథ్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన ఆమె కానిస్టేబుల్‌పై చేయిచేసుకుంది.

దీనిపై కానిస్టేబుల్‌ను విచారించిన అనంతరం … ఎమ్మెల్యేతోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కైలాశ్ సింగ్ సోమవారం వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై కుశాల్ ఘర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రమిలా ఖదియా ఇప్పటివరకూ స్పందించలేదు.

Also Read:

SBI Customer Alert: మీకు ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా.. ? అయితే ఇలా చేయండి..!

Papikondalu Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పాపికొండల పర్యటనకు బోటు సర్వీసులు..