AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Police Raped : మహిళా పోలీస్‌పై అత్యాచారం..! ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పలుమార్లు..

Women Police Raped : ముంబైలో ఒక మహిళా పోలీసుపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Women Police Raped : మహిళా పోలీస్‌పై అత్యాచారం..! ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పలుమార్లు..
Andhra Pradesh Crime
uppula Raju
|

Updated on: Jun 15, 2021 | 8:49 AM

Share

Women Police Raped : ముంబైలో ఒక మహిళా పోలీసుపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముంబైలోని మేఘావాడి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, వీడియో తీసి తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళా పోలీస్ ఆరోపించింది. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అతడి ఫ్రెండ్స్ మరో ఇద్దరు కూడా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లి సాకుతో ప్రధాన నిందితుడు లేడీ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ పై అత్యాచారం చేశాడు. ఈ సమయంలో నిందితుడు ఒక వీడియోను తయారు చేసి ఆపై బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తరువాత ఈ వీడియోను తన ఇద్దరు స్నేహితులకు కూడా పంపించాడు. తర్వాత వారు బ్లాక్ మెయిలింగ్ చేసి ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. జూన్ 11 న బాధితురాలు ఈ సంఘటన మొత్తాన్ని మేఘవాడి పోలీస్ స్టేషన్‌లో వివరించింది. ఆ తర్వాత ముగ్గురిపై కేసు నమోదైంది.

నిందితుడు ఔరంగాబాద్ నివాసి ప్రధాన నిందితుడు ఔరంగాబాద్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా మహిళా పోలీసు అతడి మధ్య స్నేహం జరిగింది. దీని తరువాత ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. బాధితురాలిని కలవడానికి నిందితుడు ముంబైలోని పోవై ప్రాంతానికి వచ్చేవాడు. ఆమెను వివాహం చేసుకుంటానని కూడా హామీ ఇచ్చాడు. అయితే ఈ సమయంలో నిందితుడు బాధితురాలి నగ్న వీడియోలను తయారు చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ మొత్తం సంఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అతనితో సంబంధం కలిగి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

24 Wickets In One Day : ఒక్క రోజులోనే 24 వికెట్లు హాం ఫట్..! 119 సంవత్సరాల రికార్డును తిరగరాసిన ఇండియా..

Brahma Kamal Flower: విశాఖ జిల్లా డౌనూరు గ్రామంలో విక‌శించిన బ్ర‌హ్మ‌క‌మలం.. ప్ర‌త్యేక పూజ‌లు చేసిన గ్రామ‌స్థులు

Papikondalu Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పాపికొండల పర్యటనకు బోటు సర్వీసులు..