AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire accident: పాల్వంచ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఫైటర్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.

Fire accident: పాల్వంచ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఫైటర్స్
Fir Accident
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2021 | 8:46 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చెలగేగుతుండటంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం విస్తరించడంతో ఇప్పటికే సబ్ స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది.  పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. గత సంవత్సరం ఇదే సబ్ స్టేషన్ విద్యుత్ కేబుల్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Papikondalu Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పాపికొండల పర్యటనకు బోటు సర్వీసులు..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం