AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhra Pradesh: రాజీపడని మాజీ గర్ల్ ఫ్రెండ్ ని స్కూటీతో ఢీకొట్టిన యువకుడు.. గతం అంతా నేర చరిత్రే..

ప్రేమ అంటే కాలానుగుణంగా నిర్వచనాలు మారుతూ వస్తున్నాయో.. ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతోనైనా విడిపోతే మరణ శిక్ష విధించడం అంటున్నది నేటి తరం ప్రేమ. ప్రేమికులిద్దరూ గొడవ పడి విడిపోయారు. అయితే తిరిగి తనతో రాజీ సిద్ధపడడం లేదని ప్రేమికుడు రోడ్డుమీద నడిచి వెళ్తున్న మాజీ ప్రేమికురాలిని ఢీకొట్టాడు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Madhra Pradesh: రాజీపడని మాజీ గర్ల్ ఫ్రెండ్ ని స్కూటీతో ఢీకొట్టిన యువకుడు.. గతం అంతా నేర చరిత్రే..
Madhya Pradesh News
Surya Kala
|

Updated on: Sep 26, 2025 | 2:38 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికుల మధ్య గొడవ.. విడిపోవడమే కాదు.. ఏకంగా హింసాత్మకంగా మారింది. తనతో తెంచుకున్న సంబంధాన్ని తిరిగి కొనసాగించాలని ప్రేమికుడు తన మాజీ ప్రేమికురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయినా ఆ యువతి .. మళ్ళీ మాజీ ప్రేమికుడితో కలిసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడికి కోపం వచ్చి.. స్కూటర్‌పై వెళ్తూ.. తన మాజీ ప్రియురాలిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం కల్పనా నగర్ ప్రాంతంలో జరిగింది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. బాధిత యువతి కొంతకాలం క్రితం నిందితుడితో తన సంబంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే ఆ వ్యక్తి యువతిని బెదిరించి.. రాజీ పడమని బలవంతం చేస్తున్నాడు. యువకుడి కోరికను యువతి నిరాకరించింది. దీంతో అతనికి కోపం వచ్చింది. ప్రవర్తన దూకుడుగా, హింసాత్మకంగా మారిందని సమాచారం.

ప్రత్యక్ష సాక్షుల కథనాలు .. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ యువకుడు యాక్టివా స్కూటర్‌ను చాలా వేగంగా నడుపుతూ వచ్చి.. బాధితురాలు రోడ్డుపై ఉండగా ఉద్దేశపూర్వకంగా ఆమెను లక్ష్యంగా చేసుకుని దూసుకెళ్లాడు. ఇది చూసిన ఆ యువతి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో.. అతనిపై రాయి విసిరింది. దీంతో మరింత కోపంతో నిందితుడు వేగంగా వచ్చి స్కూటర్‌తో ఆమెను ఢీకొట్టి.. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఈ దాడిలో గాయపడిన యువతి.. తరువాత హీరానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై దాడి, బెదిరింపు, ఉద్దేశపూర్వకంగా హాని కలిగించడం వంటి కేసులను నమోదు చేశారు. దర్యాప్తులో ఆ యువకుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు.. పాత నేరస్థుడని తేలింది, అతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మేము నిందితుడిని గుర్తించాము.. అతని నేర నేపథ్యాన్ని నిర్ధారించాము ఇప్పటికే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు హీరానగర్‌కు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. త్వరలో అతన్ని అరెస్టు చేస్తాము” అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..