AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.. తినడానికి ముందే మరణం వచ్చింది.. ఇదేగా జీవితం.. వీడియో వైరల్

జీవితం క్షణ భంగురం అని గాలి బుడగ వంటిది అని అనేక మంది.. జీవితం అశాశ్వతమని తెలియజేస్తూ ఉంటారు. అందుకు సజీవ ఉదాహరణగా నిలుస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో. ఇందులో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి వెళ్ళాడు. అందరూ భోజనం ఆర్డర్ చేశారు. అయితే భోజనం తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ విషాదం అక్కడ ఉన్నవారిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. గందరగోళం ఏర్పడింది.

ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.. తినడానికి ముందే మరణం వచ్చింది.. ఇదేగా జీవితం.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Sep 26, 2025 | 1:45 PM

Share

మనిషి జీవితంలో మేడలు మిద్దెలు, డబ్బులు నగలు అంటూ కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతూ తనని తానే మరచిపోతున్నాడు. అయితే ఈ క్షణమే మనది.. మరుక్షణంలో జీవిస్తామో లేదో కూడా మనకు తెలియదు అన్న విషయాన్నీ మరచిపోతున్నాడు. ఆయుస్సు తీరితే ఆకలి కోసం అన్నం కోసం ఎదురుచూసిన వాడు మెతుకు కూడా తినలేడేమో అనిపిస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో. సోషల్ మీడియాలో 54 సెకన్ల నిడివి గల ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూస్తే ఎవరైనా జీవితం క్షణ భంగురం అనక మానరు.

హృదయ విదారకమైన ఈ వీడియోలో ఒక రెస్టారెంట్‌లో కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వెయిటర్ వచ్చి ఆర్డర్లు తీసుకున్నాడు. అప్పుడే ఒక యువకుడు తన కుర్చీలోంచి లేచి అవతలి వైపుకు వెళ్తున్నాడు. కుర్చీలో కూర్చున్న మరో వ్యక్తి తన కుర్చీని ముందుకు లాగి తన ఫోన్‌ను తీసి ఏదో చూస్తున్నాడు. చూడడానికి ఇదంతా సాధారణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కొంతసేపటి తర్వాత.. గళ్ళ చొక్కా ధరించిన వ్యక్తి తన ఛాతీపై చేయి వేసుకుని టేబుల్‌పై ఒరిగిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని పైకి లేపడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికి అతను చనిపోయాడని సమాచారం. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి

ఈ వీడియోను 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 అనే వినియోగదారుడు తన ఖాతాలో షేర్ చేశాడు. ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడటం.. ఫ్యామిలీ తో కలిసి ఆహారం ఆర్డర్ చేయడంతో పాటు ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.. అయితే తినడానికి ముందే మరణం వచ్చింది. ఇదంతా కేవలం 30 సెకన్లలో అంతా అయిపోయింది… జీవితం చాలా అనిశ్చితం.. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికీ ఎప్పటికీ తెలియదని అంటున్నారు. ఈ వీడియో ఇండోర్‌కు చెందినదని చెబుతున్నారు. అయితే వీడియో ప్రామాణికతను టీవీ 9 తెలుగు నిర్ధారించడం లేదు.

వీడియో చూసి యూజర్లు షాక్

ఒక వ్యక్తి ఆకస్మిక మరణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ తో స్పందిస్తున్నారు. కొందరు తమ సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు అకస్మాత్తుగా చనిపోతున్నారో అసలు అర్ధం కావడం లేదు.. ఇలాంటి మరణాలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎవరినీ పరీక్షించడం లేదని కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..