AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్‌.. కారణం ఇదే

Phani CH
|

Updated on: Sep 26, 2025 | 3:08 PM

Share

బడిలో చేరిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి పౌరులను అందించాల్సిన గురుతర బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్ధులను కామంతో చూస్తున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో పలుసార్లు మహిళా టీచర్లు కూడా బాధితులుగా మారుతున్నారు.

తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తన స్కూల్లో పనిచేసే ఓ టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విద్యాధికారి కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరైన హెడ్మాస్టర్.. అక్కడ తనను ప్రశ్నించిన వారిపై ఏకంగా బెల్టుతో దాడిచేయడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బ్రిజేంద్ర కుమార్‌ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సీతాపూర్‌ జిల్లాలోని మహమ్మదాబాద్‌ బ్లాక్‌లో గల ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను బ్రిజేంద్ర కుమార్‌ లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా టీచర్‌ ఫిర్యాదు మేరకు సీతాపూర్‌ జిల్లాకు చెందిన ‘బేసిక్‌ శిక్షా అధికారి’ అఖిలేష్‌ ప్రతాప్‌ సింగ్‌.. హెడ్మాస్టర్‌ బ్రిజేంద్ర కుమార్‌ నుంచి వివరణ కోరారు. దాంతో విద్యాధికారి కార్యాలయానికి వెళ్లిన బ్రిజేంద్ర కుమార్‌.. అధికారి అఖిలేష్‌ ప్రతాప్‌ సింగ్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, బ్రిజేంద్ర వివరణతో సంతృప్తి చెందని సదరు అధికారి ‘ఇదేం పని’ అంటూ హెడ్మాస్టర్‌ను తీవ్రంగా మందలించాడు. దాంతో హెడ్మాస్టర్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తన చేతిలోని ఫైల్‌ను సదరు ఉన్నతాధికారి టేబుల్‌పై విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా తన నడుముకున్న బెల్ట్‌ తీసి సదరు అధికారిని వెనకాముందూ చూడకుండా 4 సెకన్లలో 5 సార్లు బెల్ట్‌తో చావబాదాడు. అంతేకాదు.. సదరు అధికారి మొబైల్ తీసి పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయగా.. హెడ్మాస్టర్ అతడి చేతిలోని మొబైల్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఇంతలో గదిలోకి వచ్చిన క్లర్క మౌర్య హెడ్మాస్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడికీ హెడ్మాస్టర్ రెండు వడ్డించాడు. క్యాబిన్‌ బయట ఉన్న సిబ్బంది వచ్చి పరుగుపరుగున రూమ్‌లోకి వెళ్ళి.. ఆ హెడ్మాస్టర్‌ను అడ్డుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ కావటంతో.. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత విద్యాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్‌ బ్రిజేంద్రను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు