పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు
దొంగలు రూటు మార్చారు. మార్కెట్లో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో దొంగలు అటు వైపు దృష్టి పెట్టారు. ఒకప్పుడు ఇళ్లలో చొరబడి, షాపులకు వెళ్లి దోపిడీలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు.. ఏకంగా రోడ్లపై వెళ్తుండగా దోపిడీలు చేస్తున్నారు. దీంతో బంగారు ఆభరణాలు పెట్టుకుని భయటకు వెళ్లాలంటే హడిలిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని దిల్లీలో పట్టపగలే దోపిడీ జరిగింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం సమీపంలో కొందరు దుండగులు దారికాచి రూ.కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన శివమ్‌కుమార్ యాదవ్, రాఘవ్, సుమారు కోటిరూపాయల విలువైన బంగారు ఆభరణాలను దుకాణంలో ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను తీసుకొని తమ ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్ నుంచి భైరాన్ మందిర్‌కు బయల్దేరారు. అక్కడి నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న నగల బ్యాగులను లాగేసుకుని పారిపోయారు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న శివకుమార్, రాఘవ్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్.. కారణం ఇదే
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

