అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం
దేశవ్యాప్తంగా వీధి శునకాల దాడులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న వేళ.. గ్రామీణ ప్రాంతాల వారికి కోతుల బెడద కూడా తోడైంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలలో కోతులు రెచ్చిపోతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలో చొరబడి నానా బీభత్సం చేస్తున్నాయి. అడ్డుకోబోయిన వారి మీద ఊహించని రీతిలో దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి పట్టుకొని పోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా ఓ కోతుల గుంపు వచ్చింది. అవి ఇళ్లలోకి ఎక్కడ చొరబడతాయోనని భావించిన రాజు కోతులను తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోతుల గుంపు ఒక్కసారిగా అతడి మీద దాడికి తెగబడింది. ఈ క్రమంలో అతడు కిందపడిపోగా, అతని చెవిని కొరికేసి, ఆ చెవిని పట్టుకొని పారిపోయాయి. దీంతో బాధితుడు తీవ్రమైన భయంతో కేకలు వేయగా, స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చిన రాజును చూసి.. డాక్టర్లు సైతం షాకయ్యారు. రాజు ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలి కాలంలో కోతుల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారని, ఇకనైనా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని, ఏదైనా పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

