AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

Phani CH
|

Updated on: Sep 25, 2025 | 5:03 PM

Share

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా మోసాలూ డెవలప్‌ అవుతున్నాయి. మోసానికి కాదేదీ అనర్హం.. డబ్బ సంపాదించడమే లక్ష్యం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. ఈ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారు. తియ్యని మాటలతో పెళ్లికాని ప్రసాదుల మీద వలపు వల విసిరి.. పెళ్లి చేసుకుందామని నమ్మించి.. ఈ లోపే వారిని దోచేసుకుంటున్నారు కొందరు యువతులు.

తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆన్‌లైన్‌ వివాహ వేదికలో పరిచయమైను యువకుడ్ని ఓ యువతి మోసం చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడ పటమటకు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది జూన్‌ 23న కీర్తి చౌదరి అనే యువతి ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో కలిసింది. ఇద్దరి అభిరుచులు కలిసాయి. దీంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత ‘ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడదాం.. అది మనకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అని ఆ యువతి ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి యువకుడు సరే.. అనటంతో వ్యాపారంలో నిపుణుడంటూ తన బంధువు ఒకరిని పరిచయం చేసింది. అతను ఏదో బిజినెస్‌ ప్లాన్ అంటూ చెప్పి.. రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయని నమ్మబలికాడు. అప్పటికే యువతి ప్రేమలో ఉన్న యువకుడు.. ఆయన చెప్పినట్లుగా ఆన్‌లైన్‌లో రూ.8 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. తొలిరోజుల్లో దానికి ఊహించని లాభాలు రావటంతో.. తెగ సంబరపడిపోయాడు. ఆ తరువాత యువకుడిని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించడానికి స్కెచ్‌ వేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మరింత లాభాలు వస్తాయని చెప్పగా.. వారి మాటలు పూర్తిగా నమ్మిన యువకుడు 4 వేల అమెరికన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత తన ఖాతాలో కనిపిస్తున్న లాభాలను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. దీనిపై విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణకు డబుల్‌ అలర్ట్‌ పొంచి ఉన్న అతి భారీవర్షాలు

ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం

GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్