ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ
దసరా పండుగ వేళ.. దేశవ్యాప్తంగా అమ్మవారి భక్తులంతా విశేషంగా శక్తి ఆరాధన చేస్తారు. అయితే.. ఓ అమ్మవారి ఆలయంలో మాత్రం దసరా పూజలలో మహిళలను అనుమతించరు. మహిళా శక్తికి ప్రతిరూపమైన అమ్మవారిని కొలిచేందుకు ఇక్కడ స్త్రీలను అనుమతించకపోవడం విచిత్రం. ఈ సంప్రదాయం 9వ శతాబ్దం నుంచి అమలులో ఉండటం విశేషం.
బిహార్ రాష్ట్రం ఘోస్‌రావా గ్రామంలో అతి పురాతన ‘మా ఆశాపురి’ ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి దేవతామూర్తి ఒడిలో ఒక బిడ్డ ఉంటుంది. 9వ శతాబ్దంలో బీహార్‌లోని నలంద ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉండేవి. దేవీ నవరాత్రుల టైంలో రోజూ.. ఈ ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారట. ఆ సమయంలో గ్రామంలోని ఎవరినీ అనుమతించేవారు కాదు. నేటికీ ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నవరాత్రి సమయంలోనూ 9 రోజుల పాటు మా ఆశాపురి ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే.. గతానికి భిన్నంగా బౌద్ధసన్యాసులకు బదులు పూజారులు ఈ పూజలు చేస్తున్నారు. ముగ్గురు పూజారులు ఆలయంలోకి వెళ్లి నవరాత్రుల వేళ.. రెండు పూటలా.. పూటకి నాలుగైదు గంటల చొప్పున పూజలు చేస్తారు. ఈ పూజల సమయంలో పూజారులు జపించే ప్రత్యేక మంత్రాల వల్ల అక్కడి వాతావరణంలోకి నెగెటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని, అందుకే గ్రామస్థులను ఆలయంలోకి అనుమతించరని స్థానికులు తెలిపారు. అయితే.. నవరాత్రి చివరి రోజున హోమం చేస్తారు. హవనం వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందని, ఆ తర్వాతే తర్వాతే గ్రామంలోని పురుషులు, స్త్రీలను ఆలయంలోకి అనుమతిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున
Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

