YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యలో వీడని మిస్టరీ.. రెండేళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌.. తెరపైకి కొత్త ముఖాలు..!

మాజీ మంత్రి రెండేళ్ల క్రితం దారుణ హత్య. ఇప్పటికీ నిందుతులను గుర్తించలేకపోయారు. ఓ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌కి సరిపడా ట్విస్టులున్న కేసు. అటోఇటో తేల్చేయాల్సిన సీబీఐకి కూడా ఓ పట్టాన అంతుపట్టని కేసు.

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యలో వీడని మిస్టరీ.. రెండేళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌.. తెరపైకి కొత్త ముఖాలు..!
Ys Vivekananda Reddy Murder Case Cbi Enquiry
Balaraju Goud

|

Jun 21, 2021 | 8:53 AM

YS Viveka Murder Case: ఆయన ఒక తెలుగు రాష్ట్రాల్లో పేరునున్న నేత. మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత సీఎంకు స్వయాన బాబాయ్. మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారు. అనుహ్యంగా ఆయన ఇంట్లో రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పటికీ నిందుతులను గుర్తించలేకపోయారు. ఓ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌కి సరిపడా ట్విస్టులున్న కేసు. అటోఇటో తేల్చేయాల్సిన సీబీఐకి కూడా ఓ పట్టాన అంతుపట్టని కేసు. తెరపైకి కొత్త మొహాలొస్తున్నాయి. రోజులకొద్దీ విచారణ జరుగుతోంది. కానీ కేసు మాత్రం తెగడం లేదు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య జరిగి రెండేళ్లుగడిచింది. సీబీఐ రంగంలోకి దిగి క్యాలెండర్‌లో పేజీలు తిరిగిపోతున్నాయి. కానీ విచారణలో పురోగతి జీరో. నిందితులెవరో ఇప్పటికీ తేలకపోవటంతో మిస్టరీగానే ఉండిపోయిందీ హత్యకేసు. పనిమనుషుల నుంచి సన్నిహితులదాకా ఎంతోమందిని విచారించినా చిక్కుముడి వీడటం లేదు. నాలుగో దశ విచారణలో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 2వారాల నుంచి అనుమానితులందరినీ ప్రశ్నిస్తోంది. కొత్తకొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. వివేకా ముఖ్య అనుచరుడు గంగిరెడ్డి వరసగా నాలుగోరోజు విచారణకు హాజరయ్యారు.

వివేకా హత్య జరిగిన రోజు ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ ఆయన్ని అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డిని సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించింది. వివేకా ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయపరమైన అంశాలన్నీ గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవని సమాచారం. వివేకా ఎక్కడికి వెళ్లినా తోడుగా ఉండే గంగిరెడ్డికి గతంలోనే సిట్ నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించింది.

ఒకరిని విచారిస్తే మరో అనుమానితుడి పేరు బయటికొస్తోంది. దీంతో లింకులన్నీ తేలితేగానీ మర్డర్‌ కేస్‌ ఇన్వెస్టిగేషన్‌లో ఓ క్లారిటీ వచ్చేలా కనిపించడంలేదు. వివేకా మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్తగిరి, కంప్యూట‌ర్ ఆప‌రేటర్‌ ఇనాయ‌తుల్లా, కిర‌ణ్‌, సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన ఓబుల్ పతినాయుడు, రాఘవేంద్ర, కిశోర్ కుమార్ రెడ్డిని కొత్తగా విచారించింది సీబీఐ. కడపకు చెందిన చిన్నపరెడ్డి, లక్ష్మీరెడ్డిని విచారించారు. హత్య జరిగిన రోజు వివేక్ ఇంటి పరిసరాల్లో అనుమానంగా తిరిగిన వాహనాలు గుర్తించిన కూపీ లాగుతోంది సీబీఐ. ఓ ఇన్నోవా ఓనర్‌ రవితోపాటు డ్రైవర్‌ గోవర్దన్‌ని విచారించింది. కేసు విచారణలో ఈ వాహనం కూడా కీలకంగా మారిందని చెబుతున్నారు.

మరోవైపు, ఈ కేసు డైవర్ట్‌ అవుతోందన్న ప్రచారం జరుగుతున్నా.. ఈసారి దర్యాప్తులో మాత్రం కొందరి అరెస్ట్‌ ఖాయమన్న వాదన బలంగానే ఉంది. పాత్రధారులు దొరికితే సూత్రధారుల సంగతి తర్వాత చూడొచ్చన్న యాంగిల్‌లో సాగుతోంది సీబీఐ ఇన్వెస్టిగేషన్‌. హత్య జరిగిన రెండేళ్లు గడిచినా దర్యాప్తు సాగుతూనే ఉంది. మరోసారి ఫైలు దుమ్ముదులిపిన సీబీఐ అధికారులు గత రెండువారాలుగా విచారణ వేగవంతం చేశారు.

Read Also…  Tadepalli Gang-raped: తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక ఆధారాలు.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో వేట

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu