Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.
గుంటూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు మధ్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఆరుగురు ఆకతాయిలు మద్యం మత్తులో పెట్రోల్ బంక్ వర్కర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో రాజీకి బేరాలు ఆడుతున్నారు.
గుంటూరు జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం నాడు ఆరుగురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. అక్కడ పని చేస్తున్న ఓ కుర్రాడితో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో కుర్రాడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక్కడిని దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ ఘటన అంతా పెట్రోల్ బంక్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాగా, ఆకతాయిల దాడిలో గాయపడిన యువకుడు బంక్ యజమాని సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశాడు. నిందిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, యువకుడిపై దాడికి పాల్పడిన వారు అధికార పార్టీకి చెందిన నేతలకు దగ్గరి వారు కావడంతో.. రాజీకి రమ్మంటూ బంక్ యజమానిపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు. యువకుడు మాత్రం తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ‘ధమ్ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో తిరగబెట్టింది వైనం వైరల్ అవుతున్న వీడియో :Car Viral Video.
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు రాత్రి 10గంటల వరకు పరుగులు :Hyderabad Metro Train Video.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
