Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ తుపాకుల మోత.. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 11, 2021 | 1:24 PM

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని బండిపోరా జిల్లా హజీన్ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది.

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ తుపాకుల మోత.. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు..
Kashmir

Follow us on

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని బండిపోరా జిల్లా హజీన్ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బండిపోరాలోని గుండ్ జహంగీర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలతో పాటు.. స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. కాగా, లష్కరే తోయిబా శాఖ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్ట్ అయిన ఉగ్రవాదులను తారిఖ్ అహ్మద్ దార్, మహ్మద్ షఫీ దార్, ముదాసిర్ హసన్ లోన్, బిలాల్ అహ్ దార్ గా వెల్లడించారు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. మహ్మద్ షఫీ అనే పౌరుడిని చంపిన ఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్లు భద్రతా దళాలు తేల్చాయి. అయితే, మరో ఉగ్రవాది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే, హజిన్ ప్రాంతంలో అల్లర్లు సృష్టించే కుట్రలో భాగంగా ఈ హత్యకు పాల్పడినట్లు భద్రతా దళాలు తేల్చాయి.

ఇదిలాఉంటే.. కశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన మైనారిటీల హత్యలను, ఉగ్రవాదానికి మద్ధతుగా నిలుస్తున్న వారికి వ్యతిరేకంగా పలు ముస్లిం సంఘాల ప్రతినిథులు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంకా ఎంతకాలం’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. గత కొద్ది రోజులుగా కశ్మీర్‌లో సుమారు ఏడుగురు సాధారణ పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఇందులో మైనార్టీ వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.

Also read:

Beer: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్.. పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

Exercises for Beginner: వ్యాయామం చేయడం ప్రారంభిస్తున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu