Indian Railways: రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్.. పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు
Festival Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటితో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు లబ్ధి చేకూరనుంది.
Festival Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ – టాటా నగర్ జంక్షన్(జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్)కు మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15 నుంచి 30 తేదీ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 15, 22, 29 తేదీల్లో టాటా నగర్ నుంచి కాచిగూడకు మూడు ప్రత్యేక రైళ్లను (రైలు నెంబర్. 08197) నడపనున్నారు. ఇవి టాటానగర్‌లో శుక్రవారం ఉదయం 5.15 గం.లకు బయలుదేరి మరుసటి రోజు(శనివారం) ఉదయం 11 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
అలాగే ఈ నెల 16, 23, 30 తేదీల్లో కాచిగూడ నుంచి టాటా నగర్‌కు మూడు ప్రత్యేక రైళ్లను(రైలు నెంబర్. 08198) నడపనున్నారు. ఇది కాచిగూటలో శనివారం మధ్యాహ్నం 12.45 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు(ఆదివారం) మధ్యాహ్నం 4 గం.లకు టాటా నగర్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు ఈ ప్రత్యేక రైళ్లతో లబ్ధి చేకూరుతుంది. రెండు వెపులా ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో గుంటూరు, విజయవాడ, దువ్వాడ, సింహాచలం రోడ్డు, విజయనగరం, బొబ్బిలి జంక్షన్, పార్వతీపురంలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి.
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు..
Kacheguda – TATA – Kacheguda Festival Special Trains#DussehraFestivalTrains @drmhyb @VijayawadaSCR @drmgnt https://t.co/5mRri5ChQz pic.twitter.com/KOca3YS3HU
— South Central Railway (@SCRailwayIndia) October 10, 2021
Also Read..
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు – సైనికుల మధ్య భీకర కాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి..!