Road Accident: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి.. రోడ్డు దాటుతుండగా..
Pocharam Srinivas Reddy Convoy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి
Pocharam Srinivas Reddy Convoy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఈ విషాద సంఘటన జరిగింది. కాళ్ళకల్ గ్రామంలో నివాసముంటున్న నర్సింహారెడ్డి(50) రోడ్డు దాటుతుండగా సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. నర్సింహారెడ్డి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: