Robbery: షాకింగ్ సీన్.. దొంగతనం చేసి.. డిప్యూటీ కలెక్టర్‌కు లేఖ రాసిన దొంగలు.. ఏమన్నారంటే..?
Collector House Robbery: దొంగలు దోచుకున్న అనంతరం ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పారిపోతుంటారు.. డబ్బులు, బంగారం లాంటివి ఉంటే.. దోచుకెళ్తారు.. లేకపోతే
Collector House Robbery: దొంగలు దోచుకున్న అనంతరం ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పారిపోతుంటారు.. డబ్బులు, బంగారం లాంటివి ఉంటే.. దోచుకెళ్తారు.. లేకపోతే అక్కడి నుంచి నిరాశతో వెనుదిరుగుతారు. తాజాగా ఓ డిప్యూటీ కలెక్టర్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు లేకపోవడంతో అతనికి లేఖ కూడా రాశారు. ఇంట్లో డబ్బులు లేకపోతే.. తాళం ఎందుకు వేశారంటూ అధికారిని ప్రశ్నిస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన దొంగతనం కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్‌లో వెలుగులోకి వచ్చింది.
దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసముంది. గౌర్ ప్రస్తుతం ఖటేగావ్ ఎస్‌డిఎమ్‌గా ఉన్నారు. అతని భార్య రత్లాంలో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ విధుల నిమిత్తం వెళ్లి శనివారం, ఆదివారం అధికారిక నివాసానికి వస్తుంటారు. అయితే.. తాజగా శనివారం ఇంటికి వచ్చిన గౌర్‌కు షాకింగ్ సీన్ ఎదురైంది. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొంత నగదు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో త్రిలోచన్ గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిలోచన్ గౌర్ ప్రభుత్వ నివాసం నుంచి దొంగలు రూ.30వేల నగదు మరికొన్ని వస్తువులు దొంగిలించినట్లు కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ క్రమంలో ఓ లేఖ కూడా లభ్యమైంది. ఇంట్లో డబ్బులు లేకపోతే తాళం ఎందుకు వేశారు.. అని ప్రశ్నిస్తూ దొంగలు డిప్యూటీ కలెక్టరును ప్రశ్నిస్తూ లేఖ రాసి వదిలి వెళ్లారు. ఈ లేఖ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చోరీ జరిగిన డిప్యూటీ కలెక్టరు ఇల్లు దేవాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రదీప్ సోని, జిల్లా పోలీసు సూరింటెండెంట్ నివాసాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టర్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.
Also Read: