Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు – సైనికుల మధ్య భీకర కాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి..!

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. రాజౌరి సెక్టార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు- సైనికుల మధ్య భీకర కాల్పులు..

Jammu Kashmir Encounter:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు - సైనికుల మధ్య భీకర కాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 11, 2021 | 1:18 PM

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. రాజౌరి సెక్టార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు- సైనికుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు  మృతి చెందగా, మరో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలిస్తుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు అడ్డగా మారిన ఈ ప్రాంతంలో వారి కోసం ప్రతినిత్యం భారత సైనికులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ప్రతి రోజు ఏదో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను హతమార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

మరో రెండు చోట్ల కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం:

కాగా, ఇంతకు ముందు జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు పేర్కొన్నారు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా పూర్తిగా తెలిదని తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అలాగే మరో చోట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

AP Crime News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం.. చోరీ కోసం కత్తితో నరికి దారుణ హత్య

Talaq – Khula: నువ్విస్తావా..? నేనివ్వాలా..? భర్తకు భార్య వార్నింగ్.. పాతబస్తీలో షాకింగ్ సీన్..