AP Crime News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం.. చోరీ కోసం కత్తితో నరికి దారుణ హత్య
చోరీలో కోసం మనుషులను చంపడానికి కూడా వెనకాడటం లేదు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోని దుండగులు. తాజాగా దోపిడి దొంగలు ఓ వ్యక్తిని చంపి బంగారు ఆభరణాలలో ఎత్తుకెళ్లారు.
చోరీల కోసం మనుషులను చంపడానికి కూడా వెనకాడటం లేదు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోని దుండగులు. తాజాగా దోపిడి దొంగలు ఓ వ్యక్తిని చంపి బంగారు ఆభరణాలలో ఎత్తుకెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు అంతా పక్కాగా ఉందని చెబుతున్నా.. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. చోరీ కేసుల్లో నిందితులు పట్టుబడకపోవడంతో ఇప్పుడు ఏకంగా హత్యలు చేసే వరకు వెళ్తున్నారు. తాజాగా తాడిపత్రి పట్టణంలోని టైలర్ కాలనీ వద్ద శివనగర్ లో నివాసం ఉంటున్న వడ్డే కొండయ్యను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. కొండయ్యను తలపైన దారుణంగా నరికి ఇంటిలో ఉన్న 5 తులాల బంగారు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.
నెల క్రితం పట్టణంలో సుంకులమ్మ పాలెంలో కిలోన్నర బంగారం దొంగతనం జరిగింది. వారం క్రితం శ్రీరాములు పేటలో 17 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఇవాళ మార్కెట్ యార్డ్ వద్ద ఓ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. మూడు లక్షల రూపాయలు నగదు, 50 వేల రూపాయలు విలువ చేసే సిగరెట్లు దొంగలు ఎత్తుకెళ్లారు.
ఇలా వరుసగా దొంగతనాలు జరుగుతున్నా.. పోలీసుల రికవరీలు మాత్రం లేవు. గతంలో పందుల దొంగతనం సంఘటనలతో పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వరుస చోరీలు, దోపిడీ సంఘటనలన్నీ చూస్తే తాడిపత్రి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాడిపత్రిలో ఈ వరుస ఘటనలకు చెక్ పెట్టేందుకు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దోపిడీ దొంగలు హత్యలకు వెనుకాడకపోవడంతో తాడిపత్రి జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Also Read..
HIV Positive: షాకింగ్ న్యూస్.. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ.. 85 మందికి పాజిటివ్..
Power Cuts: పంజాబ్లో విద్యుత్ సంక్షోభం.. తగ్గిపోయిన ఉత్పత్తి.. 3 థర్మల్ విద్యుత్ కేంద్రాల మూత..!