HIV Positive: షాకింగ్ న్యూస్.. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ.. 85 మందికి పాజిటివ్..
Nagaon Central Jail: అస్సాంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం
Nagaon Central Jail: అస్సాంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో జరిగింది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షల్లో సుమారు 85 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే.. 85 మంది ఖైదీల్లో 45 మంది స్పెషల్ జైల్‌కు చెందిన వారు కాగా.. మరో 40 మంది నౌగావ్ పట్టణంలోని సెంట్రల్ జైలుకు చెందిన వారని.. నౌగావ్ బీపీ సివిల్ ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ ఎల్‌సీ నాథ్ పేర్కొన్నారు.
చాలామంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఒకేసారి హెచ్ఐవీ ఎలా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్‌కు అలవాటు పడిన వారని వైద్యులు పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకొనేటప్పుడు వాడిన సిరంజ్‌ల కారణంగా.. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. కాగా.. అంతకుముందు నిర్వహించిన హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ పరీక్షల్లో నలుగురు మహిళలు సహా పలువురికి హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు.
Also Read: