Crime News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..

Hyderabad Crime News: ఓ మైనర్‌ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పారు.. ఆ తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపారు.. ఆ తర్వాత గుట్టుచప్పడు

Crime News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 11, 2021 | 8:50 AM

Hyderabad Crime News: ఓ మైనర్‌ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పారు.. ఆ తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపారు.. ఆ తర్వాత గుట్టుచప్పడు కాకుండా బాలికతో వ్యభిచారం చేయిస్తూ.. వేలల్లో దండుకుంటున్నారు. ఈ వ్యభిచార ముఠా గుట్టును బాలాపుర్​పోలీసులు రట్టు చేశారు. బాలాపూర్​రాయల్​కాలనీలోని వ్యభిచార గృహంపై బాలాపూర్​పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. వ్యభిచార కూపం నుంచి 17 సంవత్సరాల మైనర్​బాలికకు విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని బాలాపూర్​పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలాపూర్​ ఇన్‌స్పెక్టర్​భాస్కర్​తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​రాయల్​కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్​కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో.. పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది. ఇదే అదనుగా భావించి రేహానా బేగం.. ఆ మైనర్​బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది.

ఆ తర్వత రెహానాబేగం.. ఒక్కొక్క విటుడి నుంచి రూ.2వేలు వసులు చేస్తూ.. వాటిలో సగం డబ్బులు బాలికకు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో సమాచారం మేరకు బాలాపూర్​పోలీసులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. అనంతరం రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. మైనర్​బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్, సల్మాబేగం, విటుడు మహ్మద్​ అష్యులను బాలాపూర్​పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్.

Also Read:

Road Accident: విషాదం.. పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ఎదురొచ్చిన మృత్యువు.. ముగ్గురు మృతి..

Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..