Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..

Mother Killed 2 children: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలనూ ఉరివేసి చంపింది. ఈ దారుణ సంఘటన

Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 11, 2021 | 7:46 AM

Mother Killed 2 children: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలనూ ఉరివేసి చంపింది. ఈ దారుణ సంఘటన రాజమండ్రి పట్టణంలోని ఆనంద్‌నగర్‌లో జరిగింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. తాడేపల్లికి చెందిన అనూష 13 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో రాజమండ్రికి వచ్చి బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇటీవల పిల్లల విషయంలో ఆమె తల్లితో సైతం గొడవ పడింది. పిల్లల్ని కొట్టద్దని అడొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను సైతం అనూష గాయపర్చింది.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కుమార్తె చిన్మయి (8), మోహిత్‌ (6) ను ఇంట్లో ఉరివేసి చంపినట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి త్రీ టౌన్‌ పోలీసులు అనూషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం అనూష ప్రియుడికి ఫోన్ చేసినట్లు సమాచారం.

అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి పిల్లలను చంపిందా.. లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Guntur: గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని నడింపాలెం జాతీయ రహదారిపై జోరుగా వ్యభిచారం

Cruise Drugs Case: ఆ మహిళ డ్రగ్స్ వాటిలో దాచి షిప్ లోకి తీసుకువెళ్ళింది.. వెల్లడించిన ఎన్సీబీ అధికారులు

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.