Cruise Drugs Case: ఆ మహిళ డ్రగ్స్ వాటిలో దాచి షిప్ లోకి తీసుకువెళ్ళింది.. వెల్లడించిన ఎన్సీబీ అధికారులు
ఇటీవల సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ ఆ షిప్ లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల మార్గాలను అనుసరించారు నిందితులు.
Cruise Drugs Case: ఇటీవల సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ ఆ షిప్ లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల మార్గాలను అనుసరించారు నిందితులు. షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అర్బాజ్ దగ్గర దొరికిన చరాస్ అతని షూలో దాచి ఉంచినట్టు తెలుసుకున్నారు ఎన్సీబీ అధికారులు అదేవిధంగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఒక మహిళ, సానిటరీ న్యాప్‌కిన్‌లో దాచి ఉంచడం ద్వారా నౌకకు డ్రగ్స్ తీసుకెళ్లినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శనివారం వెల్లడించింది. ఇటువంటి రకరకాల మార్గాల్లో డ్రగ్స్ ను తరలించారని ఎన్సీబీ చెబుతోంది. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ తాజాగా శనివారం ఒక డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసింది దీంతో అరెస్టుల సంఖ్యా 19కి చేరింది. ఇక ఈ కేసులో అరెస్టయిన నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రైవర్‌ని కూడా ఎన్‌సిబి శనివారం విచారించింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సినీ నిర్మాత ఇంతియాజ్ ఖత్రిని పిలిచి అక్టోబర్ 11 న ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని కోరింది.
అక్టోబర్ 2 న సముద్రతీరంలో గోవాకు వెళుతున్న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఎన్‌సిబి బృందం డ్రగ్స్ పార్టీ జరుగుతోందని తెలిసి రైడ్ చేసింది. ఆ సమయంలో అక్కడ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సహా 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేసింది. విచారణలో వీరికి డ్రగ్స్ సరఫరా చేశారని కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ముగ్గురిని తరువాత ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ పద్నాలుగు మందినీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి పంపించింది.
ఈ సమయంలో ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ, కోర్టు బెయిల్ నిరాకరించింది. తరువాత ఈ విషయంపై మాట్లాడుతూ ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే “నిందితుడు నంబర్ 1, ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ పార్టీకి ఆహ్వానంపై వెళ్ళదు. అతనికి బోర్డింగ్ పాస్ లేదు. అతనికి సీట్లు లేదా అక్కడ క్యాబిన్లు కూడా లేవు. రెండవది, అతన్ని అరెస్ట్ చేసినపుడు అతని వద్ద ఏ విధమైన డ్రగ్స్ దొరకలేదు. మొబైల్ చాట్‌ల ఆధారంగా మాత్రమే అతడిని అరెస్టు చేశారు.” అని చెప్పారు.
Also Read: Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?
Hugging: కౌగిలించుకోవడం వల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజనాలు..! మీకు తెలియకుండానే జరిగిపోతాయి..