AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hugging: కౌగిలించుకోవ‌డం వ‌ల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజ‌నాలు..! మీకు తెలియ‌కుండానే జ‌రిగిపోతాయి..

Hugging Benefits: మ‌నిష‌కి ఆనందం క‌లిగిన‌ప్పుడు, బాధ క‌లిగిన‌ప్పుడు ఆత్మీయుల‌ను కౌగిలించుకోవ‌డం మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం.

Hugging: కౌగిలించుకోవ‌డం వ‌ల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజ‌నాలు..! మీకు తెలియ‌కుండానే జ‌రిగిపోతాయి..
Hugging Benefits
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 10, 2021 | 6:16 AM

Share

Hugging Benefits: మ‌నిష‌కి ఆనందం క‌లిగిన‌ప్పుడు, బాధ క‌లిగిన‌ప్పుడు ఆత్మీయుల‌ను కౌగిలించుకోవ‌డం మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం. ఇలా చేయ‌డం వ‌ల్ల వారికి కొద్దిగా మ‌న‌శ్శాంతి దొరుకుతుంది. మంచి అనుభూతుల‌ను మిగులుస్తుంది. ఒత్తిడి ని త‌గ్గిస్తుంది. ఇవి మాత్ర‌మే కాదు కౌగిలించుకోవ‌డం వ‌ల్ల చాలా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్క‌సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

1. ఒంటరితనం పోతుంది కౌగిలించుకోవడం వ‌ల్ల ఒంట‌రిత‌నం అనే ఫీలింగ్ క‌లుగ‌దు. వాస్తవానికి కౌగిలించుకునే సమయంలో సెరోటోనిన్ అనే హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది. దీనిని ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. శరీరంలో ఈ హార్మోన్ విడుదల కావడం వల్ల నిద్ర, మానసిక స్థితిని మెరుగుపరచడంలో స‌హాయం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఒంటరితనం తొలగిపోతాయి సంతోషకరమైన జీవితం గ‌డ‌ప‌డానికి అవ‌కావశం ఉంటుంది.

2. ఆరోగ్యక‌ర‌మైన గుండె కౌగిలించుకోవడం వ‌ల్ల గుండెకు ఆనందాన్ని, ఉపశమనాన్ని ఇచ్చిన‌ట్లవుతంది. పెద్ద భారాన్ని దించిన‌ట్లవుతుంది. అప్పటి వ‌ర‌కు ఒంట‌రిగా ఉన్న మ‌నిసషికి ఇదొక హాయిని క‌లిగిస్తుంది. త‌న సుఖ దుఖాల‌ను పంచుకోవ‌డానికి ఒక‌రు ఉన్నార‌నే భావ‌న క‌లిగిస్తుంది. ఇది మ‌నిషిలోని డిప్రెషన్‌ని తొలగిస్తుంది. కౌగిలింతల సమయంలో శరీరం నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలను కౌగిలించుకునే సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ అధిక పరిమాణంలో విడుదల అవుతుంది. ఇది పరస్పర ప్రేమను పెంచడంలో తోడ్ప‌డుతుంది.

3. ర‌క్తపోటు నియంత్రణలో ఉంటుంది కౌగిలించుకోవడం వ‌ల్ల రక్తపోటు నియంత్రణ‌లో ఉంటుంది. మీరు ఏదైనా టెన్షన్‌కి ఫీలైన‌ప్పుడు బీపీ ఎక్కువ‌వుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరినైనా కౌగిలించుకుంటే మీ టెన్షన్ త‌గ్గుతుంది. దీని వ‌ల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

4. ఇమ్యూనిటీ పెరుగుతుంది కౌగిలించుకోవడం వ‌ల్ల మ‌నిషి ఆనందానికి, అనుభూతికి లోన‌వుతాడు. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాస్తవానికి మనం ఒకరిని కౌగిలించుకున్నప్పుడు మనలోని టెన్షన్‌, ఒంట‌రిత‌నం పోతాయి. ఇది మనలోధైర్యాన్ని నింప‌డంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఫిట్‌గా ఉంటాం. అన్ని రోగాల‌ను త‌ట్టుకునే విధంగా త‌యార‌వుతాం.

Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. ‘కుటుంబం జోలికొస్తే సహించేది లేదు’..