Crime News: పెళ్లైన నెలకే బలవన్మరణం.. భర్త వేధింపులు తాళలేక నవ వధువు అఘాయిత్యం..

Newly married woman suicide: భర్తతో కలకాలం జీవించాలని ఎన్నో కలలు కన్నది యువతి.. కానీ పెళ్లైన నెల రోజులకే.. ఆమె ఆశలన్నీ నీరుగారిపోయి విగతజీవిగా మిగిలింది. భర్త వేధింపులు

Crime News: పెళ్లైన నెలకే బలవన్మరణం.. భర్త వేధింపులు తాళలేక నవ వధువు అఘాయిత్యం..
Woman Suicide
Follow us

|

Updated on: Oct 10, 2021 | 10:04 AM

Newly married woman suicide: భర్తతో కలకాలం జీవించాలని ఎన్నో కలలు కన్నది యువతి.. కానీ పెళ్లైన నెల రోజులకే.. ఆమె ఆశలన్నీ నీరుగారిపోయి విగతజీవిగా మిగిలింది. భర్త వేధింపులు తట్టుకోలేక నూతన వధువు బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లైన నెలకే వరకట్న వేధింపులు భరించలేక నూతన వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న వెంకటేశులు, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె పల్లవి (28) ఉన్నత విద్యనభ్యసించింది. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన పల్లవి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.

ఈ క్రమంలో పల్లవిని కుటుంబ సభ్యులు.. ఆగస్టు 27న పామిడికి చెందిన ప్రైవేటు టీచర్ మలికార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి అయిన కొన్ని రోజులకే.. ఇచ్చిన కట్నకానుకలు చాలవని, అదనపు కట్నం తీసుకురావాలంటూ పల్లవిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన పల్లవి నెల రోజులకే పుట్టింటికి వెళ్లింది. పది రోజులుగా పుట్టింట్లో ఉన్న పల్లవిని.. భర్త తరచూ ఆమెకు ఫోన్‌ చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో పల్లవి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Crime News: ఇల్లు ఇప్పిస్తామంటూ.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత ఫొన్లో రికార్డు చేసి..

కుళ్లిపోయిన శవంతో జాగారం.. కన్నతల్లి బతికొస్తుందని కూతుళ్ల ప్రార్థనలు.. 7 రోజుల తర్వాత..

Crime News: విషాదం.. గుడిసె కూలి కుటుంబం దుర్మరణం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురు చిన్నారులు..