Viral Video: వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్‌కు చెవిలో మైక్రోచిప్.. కాలికి బ్లూటూత్.. షాకింగ్ వీడియో..

Hitech copying in police exam: ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి

Viral Video: వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్‌కు చెవిలో మైక్రోచిప్.. కాలికి బ్లూటూత్.. షాకింగ్ వీడియో..
Maharashtra Police Exam
Follow us

|

Updated on: Oct 11, 2021 | 12:34 PM

Hitech copying in police exam: ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకురానివ్వరు. దీంతో కాపీ కొట్టడానికి అవకాశమే ఉండదు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు హైటెక్ తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎగ్జామ్‌లో కాపీ కొట్టేందుకు కొత్త కొత్త ప్లాన్లు రచిస్తున్నారు. ఇటీవలనే బ్లూటూత్ చెప్పులతో హైటెక్ కాపీయింగ్‌కు ప్రయత్నించి.. పలువురు అభ్యర్థులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే.. మహారాష్ట్రలో మరో మాస్టర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. మైక్రోచిప్ బ్లూటూత్ పరికరంతో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చెవిలో మైక్రోచిప్‌ను అమర్చుకుని వచ్చిన 24 ఏళ్ల వ్యక్తిని జల్గావ్‌లో శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఔరంగాబాద్‌లోని వైజాపూర్‌ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ బలోధ్‌.. జల్గావ్‌లోని వివేకానంద్ ప్రతిష్ఠాన్ ఉన్నత పాఠశాలలో పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభానికి ముందు అతను రెండుసార్లు టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. దీంతోపాటు పరీక్ష హాలులో అతని కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు.. క్షణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు అతన్ని తనిఖీ చేయగా.. చెవిలో మైక్రోచిప్‌ను కనుగొన్నారు. అయితే.. కాల్‌ను స్వీకరించే విధంగా కాలికి బ్లూటూత్ పరికరాన్ని సైతం అతను ఏర్పాటు చేసుకున్నట్లు జల్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణ కుంభార్ తెలిపారు. అతినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వివరాలు సేకరిస్తున్నామన్నారు.

వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోలీస్ సిబ్బంది నిందితుడి చెవి నుంచి మైక్రో చిప్‌ను తీస్తున్న వీడియోను ఆయన ట్విట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

HIV Positive: షాకింగ్ న్యూస్.. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ.. 85 మందికి పాజిటివ్..

Talaq – Khula: నువ్విస్తావా..? నేనివ్వాలా..? భర్తకు భార్య వార్నింగ్.. పాతబస్తీలో షాకింగ్ సీన్..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..