GRMB Meeting: జలసౌధలో తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ.. నీటి పంపకాలపై కీలక చర్చ..

గోదావరి నదీ యాజమాన్య బోర్డు జీఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

GRMB Meeting: జలసౌధలో తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ.. నీటి పంపకాలపై కీలక చర్చ..
Godavari River Management B
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 11, 2021 | 12:46 PM

గోదావరి నదీ యాజమాన్య బోర్డు జీఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్‌ సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ ఈ నెల 14 నుంచి అముల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకొనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించిస్తున్నారు. ఈ నెల 14నుంచి గెజిట్‌ అమలులోకి రానుందని.. ప్రస్తుతం పెదవాగు ప్రాజెక్ట్‌ మాత్రమే బోర్డ్‌ పరిధిలోకి వస్తుందన్నారు తెలంగాణ ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌. పెద్దవాగు ప్రాజెక్ట్‌ కింద తెలంగాణలో 2వేల ఎకరాల ఆయకట్టు ఉందన్న రజత్‌కుమార్‌..13వేల ఎకరాల ఆయకట్టు ఏపీకి ఉందన్నారు. గెజిట్‌ అమలు గడువు కావాలని సీఎం కేంద్రాన్ని కోరారని..తాము కూడా వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు.

ఈ భేటీలో ఉపసంఘం నివేదికలు, సంబంధిత అంశాలపై చర్చిస్తామన్నారు తెలంగాణ ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌. మిగతా ప్రాజెక్టులు ఇప్పట్లో బోర్డు పరిధిలోకి వెళ్లడం కుదరదన్నారు. ఇక మంగళవారం KRMB ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలు అన్ని వివరాలు అందించాలని పేర్కొన్నారు కేఆర్‌ఎంబీ సభ్యుడు పిళ్లై. ఈ సమావేశంలో బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్స్‌పై చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి: Shiba Inu: బిట్ కాయిన్‌ను మించి పరుగులు.. 260 శాతం పెరిగిన శిబా ఇను.. మీరు కూడా..

Income Tax: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు.. చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు..

Viral Video: ఇది మామూలు మార్జాలం కాదురో.. స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి..