Exercises for Beginner: వ్యాయామం చేయడం ప్రారంభిస్తున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి..
Exercises for Beginner: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి. కానీ, ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో.. వ్యాయామం చేయడానికి సమయం లేకుండా పోతోంది.
Exercises for Beginner: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి. కానీ, ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో.. వ్యాయామం చేయడానికి సమయం లేకుండా పోతోంది. ఫలితంగా రకరకాల అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఏమాత్రం సమయం దొరికినా.. వ్యాయామం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, అడపా దడపా వ్యాయామం చేస్తుంటారు. ముఖ్యంగా ఏ రకమైన వ్యాయాయం చేయాలి? ఎలా ప్రారంభించాలో తెలియక.. ఏది పడితే అది చేస్తుంటారు. ఫలితంగా బాడీ పెయిన్స్, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే కొత్తగా ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకునే వారి కోసం సులభమైన ఆరు ఎక్సర్‌సైజ్‌ల గురించి ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు.. భారీ వర్కౌట్స్ చేసే ముందు వీటిని తప్పక చేయాలంటున్నారు. మరి బిగినర్స్ కోసం నిపుణులు చెప్పిన 6 ఎక్సర్‌సైజ్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. బర్డ్ డాగ్ ఎక్సర్‌సైజ్.. బర్డ్ డాగ్ వ్యాయామంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల నడుము భాగం, తొడలు, ఆబ్స్ బలోపేతం అవుతాయి. కఠినమైన వ్యాయామం కంటే ఇది చాలా సులభమైంది. ఇంట్లో ఉండి కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రోజూ ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
2. సైడ్ ప్లాంక్ ఎక్సర్‌సైజ్.. సైడ్ ప్లాంక్ ఎక్సర్‌సైజ్ ద్వారా బ్యాలెన్సింగ్, కంట్రోలింగ్ మెరుగుపడుతుంది. అంతేకాదు.. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆబ్స్ బలోపేతం అవుతాయి. ఈ పొజీషన్‌లో కొన్ని సెకన్ల పాటు 2 నుంచి 3 సార్లు చేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
3. బ్రిడ్జ్ ఎక్సర్‌సైజ్.. ఈ వ్యాయామం చేయడం ద్వారా వెన్నెముక బలోపేతం అవుతుంది. బాడీకి మంచి స్ట్రెచింగ్‌గా పని చేస్తుంది. తదుపరి చేసే వ్యాయామానికి శరీరం పూర్తి సన్నద్ధంగా ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే రెక్టస్ అబ్డోమినిస్, క్వాడ్రిస్ప్‌లను స్థిరీకరిస్తుంది.
4. బ్యాండెడ్ లాటెరల్ వాక్.. ఈ వ్యాయామం మోకాళ్ల నొప్పుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది గ్లూటియస్ మీడియస్‌ని కూడా బలపరుస్తుంది. మోకాలిపై పార్శ్వ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మోకాలి కీలులో సరైన ట్రాకింగ్‌ను నిర్వహించడానికి తుంటిని స్థిరీకరిస్తుంది.
5. స్కపులా పుష్ అప్స్.. ఈ స్కపులా ఫుషప్స్ చేతి కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే చేతి కండరాలు ఫ్రీగా చేస్తుంది. భుజం కదలికను మెరుగు పరుస్తుంది. ఈ ఎక్సర్‌సైజ్‌ను 3 నుంచి 5 సెకన్ల పాటు.. 3 సార్లు చేయాలి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది.
6. హాలో హోల్డ్ ఎక్సర్‌సైజ్.. హాలో హోల్డ్ ఎక్సరైజ్ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ వీపు భాగంలోని కండరాలను బలోపేతం చేస్తాయి. దిగువ ఆబ్స్ ప్రాంతంలోని కండరాలను కూడా బలంగా మారుస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఉన్నట్లయితే, ఆ కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. అలాగే తుంటి కండరాలు కూడా బలంగా మారుతాయి. హాలో హోల్డ్ ఎక్సర్‌సైజన్‌ను 2 నుంచి 3 నిముషాల పాటు 3 సార్లు చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
Also read:
Viral Video: అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో.. ఈ చిలుకను చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..!