SunFlower Seeds: పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంతో తీసుకుంటే ఫలితాలు ఎక్కువే.. ఎలాగో తెలుసుకోండి..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 11, 2021 | 11:51 AM

పొద్దు తిరుగుడు విత్తనాలు.. సాధారణంగా నూనె కోసం ఉపయోగిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు

SunFlower Seeds: పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంతో తీసుకుంటే ఫలితాలు ఎక్కువే.. ఎలాగో తెలుసుకోండి..
Sunflower

Follow us on

పొద్దు తిరుగుడు విత్తనాలు.. సాధారణంగా నూనె కోసం ఉపయోగిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని బరువు తగ్గించడానికి.. అలాగే బరువు పెంచడానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి, బి6 ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే.. పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి.

1. బరువు తగ్గడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు రోజు మీ ఆహారంలో పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవాలి. 2. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పోటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహయపడతాయి. 3. పొద్దు తిరుగుడు విత్తనాలు మానసిక స్థితి, మెదడు రెండింటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ బీ, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 4. ఇవే కాకుండా.. చర్మాన్ని మెరిసేలా చేయడంలోనూ పొద్దు తిరుగుడు విత్తనాలు ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మెరిసేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను సూప్స్, మఫిన్లు, కేక్, రొట్టెలు, సలాడ్, పాస్తాలలో కలిపి తీసుకొవచ్చు. అంతేకాకుండా.. ఒకటి రెండు స్పూన్స్ పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా సాయంత్రం టీతోపాటు తీసుకోవచ్చు. అయితే ఈ విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. అలాగే వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వలన మూత్రపిండాలు దెబ్బతింటాయి.

Also Read: Prakash Raj: నేను తెలుగువాడిని కాదు.. అది నా తప్పా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా..

Love Story: ఆహాలో మరో అందమైన ప్రేమకథ.. నాగచైతన్య, సాయిపల్లవిల లవ్‏స్టోరీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu