Prakash Raj: నేను తెలుగువాడిని కాదు.. అది నా తప్పా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్ష పదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Prakash Raj: నేను తెలుగువాడిని కాదు.. అది నా తప్పా.. ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..
Prakash Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2021 | 11:42 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్ష పదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. హోరా హోరీగా జరిగిన పోరులో చివరికి మంచు విష్ణు విజయం సాధించారు. తాజాగా ప్రకాష్ రాజ్.. మా ఎన్నికలపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా మంచు విష్ణు.. అతని ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు. మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. నేను తెలుగువాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా తప్పు కాదు. తెలుగువాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే నేను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని.. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నాను. మాతో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు ప్రకాష్ రాజ్. రఘుబాబు, కోట వ్యాఖ్యలను గౌరవిస్తాను. నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. నేను అతిథిగానే ఉంటాను.. నాకు ఆత్మభిమానం ఉంది. తెలుగు సినిమాల్లో నటిస్తాను.. నేను యూనివర్సల్‏గా ఉంటాన్నారు ప్రకాష్ రాజ్. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్‏లో నేను ఉండలేను.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం బాధతో తీసుకున్న నిర్ణయం కాదన్నారు ప్రకాష్ రాజ్.  జాతీయవాదాన్ని ప్రొత్సాహిస్తున్నారంటూ బిజేపి నేత బండి సంజయ్ కూడా ట్విట్ చేశారని..  ఇక్కడ ప్రాంతీయ వాదం ఉందన్నారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం మంచు విష్ణు తన ట్విట్టర్ వేదికగా మా ఎన్నికలపై మరోసారి స్పందించారు. శుభోదయం! నా సినిమా సోదరులు నాకు చూపించిన ప్రేమ, మద్దతు పై నేను వినయపూర్వకంగా ఉన్నాను. మా ఎన్నికలపై నేను ఇంకా ఏదైనా చెప్పే ముందు, ఈసీ సభ్యులు, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి కౌంటింగ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట్లాడతా! అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మా ఎన్నికలపై అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు.. జనరల్ సెక్రటరీ పదవికి మంచు విష్ణు ప్యానల్లో ఉన్న రఘుబాబు గెలిచారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‏గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఇక విష్ణు ప్యానల్ నుంచి మా కోశాధికారిగా శివబాలజీ ఎన్నికయ్యారు.

Also Read: MAA Elections 2021: ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా..

Love Story: ఆహాలో మరో అందమైన ప్రేమకథ.. నాగచైతన్య, సాయిపల్లవిల లవ్‏స్టోరీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Manchu Vishnu: మరోసారి మా ఎన్నికలపై స్పందించిన మంచు విష్ణు.. ఆ తర్వాతే మాట్లాడతా అంటూ ట్వీట్..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట