AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: ఆహాలో మరో అందమైన ప్రేమకథ.. నాగచైతన్య, సాయిపల్లవిల లవ్‏స్టోరీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమలో జోష్ పెంచింది లవ్ స్టోరీ సినిమా. థియేటర్లలో విడుదలై ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‏గా నిలవడమే

Love Story: ఆహాలో మరో అందమైన ప్రేమకథ.. నాగచైతన్య, సాయిపల్లవిల లవ్‏స్టోరీ  స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Love Story
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2021 | 10:53 AM

చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమలో జోష్ పెంచింది లవ్ స్టోరీ సినిమా. థియేటర్లలో విడుదలై ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‏గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించగా… క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. సెప్టెంబర్ 24న విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. ఇంకా పలు హౌస్ ఫుల్ కలెక్షన్స్‏తో దూసుకుపోతుంది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫాంలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆహాలో అక్టోబర్ 22 నుంచి లవ్ స్టోరీ సినిమమా స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా లవ్ స్టోరీ. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.  అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే, 3,07,103 డాల‌ర్స్  వసూలు చేసింది.  ఇక ఫస్ట్ డే 144 లొకేష‌న్స్‌ల్లో 85,232 డాల‌ర్స్  కలెక్షన్లు రాబట్టింది.  మన దేశ కరెన్సీలో లవ్ స్టోరీ యుఎస్ లో మొదటి రోజు రూ.2.9 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది.

Also Read: Manchu Vishnu: మరోసారి మా ఎన్నికలపై స్పందించిన మంచు విష్ణు.. ఆ తర్వాతే మాట్లాడతా అంటూ ట్వీట్..

Cruise Drug Case: షారూక్ ఖాన్ కు ఈరోజూ షాక్ తప్పదా? ఆర్యన్ బెయిల్ మార్గం ఇంకా తెరుచుకోలేదా?

MAA Elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన బండి సంజయ్.. ట్విట్టర్ వేదికగా ఏం కామెంట్ చేశారంటే..