MAA Elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన బండి సంజయ్.. ట్విట్టర్ వేదికగా ఏం కామెంట్ చేశారంటే..

MAA Elections 2021: తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

MAA Elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన బండి సంజయ్.. ట్విట్టర్ వేదికగా ఏం కామెంట్ చేశారంటే..
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2021 | 11:30 AM

MAA Elections 2021: తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుతో సహా ప్యానెల్‌లోని విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేశారు. అలాగే.. జాతీయ వాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్‌కు మద్ధతిచ్చిన వారికి ‘మా’ ఎన్నికల్లో సరైన గుణపాఠం జరిగిందటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘వాస్తవానికి ‘మా’ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. ‘మా’ ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు.’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు బండి సంజయ్.

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు. ఈ భారీ విజయంతో మంచు ఫ్యామిలీ మద్దుతుదారులు మోహన్ బాబు జిందాబాద్, విష్ణు బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలిచారు. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు.

Also read:

Crime News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..

Dil Raju: ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.. పెళ్లి సందD ఈవెంట్‏లో అసలు విషయం చెప్పిన దిల్ రాజు..

Uyyalawada Narasimha Reddy: కేంద్రం కీలక నిర్ణయం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామానికి ప్రత్యేక గుర్తింపు..

MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..