Hyderabad:కోఠి ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
వైద్యం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

Hyderabad Woman died: వైద్యం కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు వదిలింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణీ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన పూజ నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం కోఠిలోని ప్రభుత్వం మెటర్నిటీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఆరోగ్యంగా ఉన్న పూజకు సోమవారం ఉదయం కాన్పు కోసం వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే, పూజకు సిజేరిన్ ఆపరేషన్ చేస్తుండగా శిశువుకు జన్మనిచ్చి మృతి చెందింది. ఇదే విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన పూజ బంధువులు వైద్యులు సక్రమంగా ఆపరేషన్ చేయకపోవడంతో పూజ మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోఠి ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.కాగా, ఘటన పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, శిశువు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also… Viral Video: భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!
