Self Abortion: యూట్యూబ్ చూసి.. తనకు తానే అబార్షన్ చేసుకున్న యువతి.. ఏడు నెలల శిశువును..

ఏదైనా పని గురించి మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం.. తెలిసిన వారిని అడుగుతాం. వారు అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం.. ఏముంది యూట్యూబ్‎లో చూస్తాం. ఓ అమ్మాయి ఇలానే చేసింది. ఆమె చేసింది మామూలు పని కాదు. ఆమెకు అలా చేయడానికి ధైర్యం ఎలా వచ్చిందో...

Self Abortion: యూట్యూబ్ చూసి.. తనకు తానే అబార్షన్ చేసుకున్న యువతి.. ఏడు నెలల శిశువును..
Woman Watches Youtube Videos To Perform Self Abortion After Being Raped

ఏదైనా పని గురించి మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం.. తెలిసిన వారిని అడుగుతాం. వారు అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం.. ఏముంది యూట్యూబ్‎లో చూస్తాం. ఓ అమ్మాయి ఇలానే చేసింది. ఆమె చేసింది మామూలు పని కాదు. ఆమెకు అలా చేయడానికి ధైర్యం ఎలా వచ్చిందో అర్థకావటం లేదనుంటున్నారు అక్కడి స్థానికులు. ఇంతకీ ఆమె ఆమె చేసిన పని ఏమిటంటే.. యూట్యూబ్‎లో అబార్షన్ చేయడం ఎలా అని చూసి తనకు తానే స్వయంగా అబార్షన్ చేసుకుంది. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‎లో జరిగింది. ఈ 24 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురయింది. తర్వాత గర్భం దాల్చింది. ఇంటిలోని కుటుంబ సభ్యులంతా ముంబై వెళ్లిన సందర్భంలో ఆమె ఇంటిలో ఒంటరిగా ఉంది. ఇదే తగిన సమయం అని భావించిన ఆమె యూట్యూబ్‌లో అబార్షన్‌కు సంబంధించిన వీడియోను చూసింది.

దానిలో చెప్పిన పద్ధతులను అనుసరిస్తూ అబార్షన్ చేసుకుంది. ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృతశిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంటిలో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమ్మాయిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిసింది. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శారీకంగా కలవటంతో గర్భవతిని అయ్యానని తెలిపింది. అతను అబార్షన్ చేయించుకోవాలని తనను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్‎ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)

 Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..

 Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

 police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu