police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు..(వీడియో)
పోకిరీలన చట్టాలు, శిక్షలు ఏమీ చేయలేకపోతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా అమలువుతున్నా.. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రబుద్ధుల తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా అమ్మాయిల వెంటపడే పోకిరీలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు...
పోకిరీలన చట్టాలు, శిక్షలు ఏమీ చేయలేకపోతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా అమలువుతున్నా.. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రబుద్ధుల తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా అమ్మాయిల వెంటపడే పోకిరీలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. టీషీమ్స్, నిర్భయ చట్టాలు వంటివి ఉన్నా వీళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలా రెచ్చిపోతున్న పోకిరీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కొందరు యువకులు ఫలక్‌నుమాలో బాలికల కళాశాలలు, పాఠశాలల వద్ద అమ్మాయిలను ఏడిపిస్తున్నారు. కళాశాలకు వచ్చి పోయే సమయాల్లో దారి కాచి కొందరు పోకిరీలు అమ్మాయిల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఛత్రినాక పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఏరియాలో నిఘా పెంచారు. విషయం తెలియని పోకిరీలు పోలీసుల వలలో చిక్కారు. వచ్చే పోయే అమ్మాయిలపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంకోసారి కళాశాల దరిదాపుల్లో కనిపిస్తే క్రిమినల్ కేసులు పెట్టి లోపలేస్తామని హెచ్చరించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఈసారి బిగ్ బాస్ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

