Bihar court: కోర్ట్ ఆర్డర్: ఊరి ఆడవాళ్లందరి బట్టలు ఉతికి ఐరన్ చేయాలి.. వింత పనిష్మెంట్ (వీడియో వైరల్)
అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది... ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు, ఉతికి, ఐరన్ చేయాలని ఆదేశించింది.
అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది… ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు, ఉతికి, ఐరన్ చేయాలని ఆదేశించింది. ఆరు నెలలపాటు తప్పని సరిగా ఇలా చేయాల్సిందేనని కోర్టు ఖచ్చితమైన తీర్పునిచ్చింది…నిందితుడికి కేసు నుంచి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వినూత్న శిక్ష వేసింది. ఈ ఘటన బీహార్‌లోని మధుబానిలోని ఓ కోర్టు ఇలా ఊహించని తీర్పునిచ్చింది.
బిహార్‌కు చెందిన ఓ యువకుడు..స్థానిక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు కేసు నమోదు చేయగా, మధుబాని కోర్టు కేసు విచారించింది. ఏప్రిల్‌లో నిందితున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా, అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. నిందితుడు 20ఏళ్ల యువకుడే కాబట్టి, క్షమించి వదిలిపెట్టాలని, నిందితుడు సమాజానికి సేవ చేయాలని భావిస్తున్నాడని అతడి తరపు లాయర్ కోర్టు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అతనికి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బాధితురాలు సహా ఆ ఊరిలోని మహిళలందరి బట్టలను ఆరు నెలలపాటు ఉచితంగా ఉతికి ఐరన్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతోపాటు.. 10వేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది. మొత్తానికి ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Bharat Bandh Live Video: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన ‘భారత్ బంద్’.. (లైవ్ వీడియో)
Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

