Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్‌ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)

సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ముందు ఆమె కుటుంబ సభ్యులే అంగీకరించరు. ఇక సమాజం అయితే చిన్న చూపు చూస్తారు. విడాకులు తర్వాత ఆమెకు జీవితమే లేదన్నట్లు ప్రవర్తిస్తారు.

సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ముందు ఆమె కుటుంబ సభ్యులే అంగీకరించరు. ఇక సమాజం అయితే చిన్న చూపు చూస్తారు. విడాకులు తర్వాత ఆమెకు జీవితమే లేదన్నట్లు ప్రవర్తిస్తారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా తాజాగా ఓ మహిళ విడాకులు తీసుకున్న సందర్భంగా ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీకి చెందిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సోనియా గుప్తా అనే మహిళకు 2003లో వివాహం జరిగింది. భర్తతో కలిసి లండన్‌ వెళ్ళి కొత్త జీవితంలో అడుగు పెట్టింది. అప్పటి వరకు స్వతంత్ర భావాలతోఫ్రీ బర్డ్‌లా బత్రికిన సోనియాకు వివాహ జీవితం జైలులా మారింది. అత్తారింట్లో అడుగడుగునా పెట్టే ఆంక్షలు భరించలేకపోయింది.. ఇంకోవైపు సోనియా, ఆమె భర్త మధ్య బంధం కూడా పెద్దగా బలపడలేదు. 17 ఏళ్లు అలా నెట్టుకొచ్చిన సోనియా ఇక తన భర్తతో కలిసి ఉండలేకపోయింది. భర్తనుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. అదే విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇంకేముంది వారంతా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అలాంటివేం కుదరవని తేల్చి చెప్పారు.

ఆ సమయంలో సోనియా గుప్తాకు స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూపారు. ఏషియన్‌ సింగిల్‌ పేరెంట్‌ నెట్‌వర్క్‌ నుంచి కూడా మద్దతు లభించింది. మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సోనియాకు విడాకులు వచ్చాయి. ఈ సందర్భంగా సోనియా 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి నాకు విముక్తి లభించింది’’ అని తెలిపారు. విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆమె ధరించిన డ్రెస్‌ మీద.. ఫైనల్లీ డివోర్స్‌డ్‌ అనే ట్యాగ్‌ ధరించారు. “నేను నా థీమ్‌ను రంగురంగుల, ప్రకాశవంతంగా, యునికార్న్‌లతో నిండి ఉండేలా ఎంచుకున్నాను. నా జీవితం ఇలానే ఉండాలని భావించాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చింది. ఈ మాత్రం సెలబ్రెషన్స్‌కు, మ్యాజిక్‌కు నేను అర్హత కలిగి ఉన్నానని అనుకుంటున్నాను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ విడాకుల సంబరానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : Warangal Medical College: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌..! రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు..(వీడియో)

 Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

 YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)

 Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్‌ హల్‌చల్‌.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్‌..!(వీడియో)

Click on your DTH Provider to Add TV9 Telugu