Mars Quakes Video: అంగారకుడిపై ప్రకంపనలు..! ప్రకంపనలు గుర్తించిన ఇన్‌సైట్ ల్యాండర్ (వీడియో)
భూమి మీదే కాదు.. ఇతర గ్రహాలపైన కూడా భూకంపాలు వస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్ 18న అంగారక గ్రహంపై ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ఈనెల 18న ప్రకంపనలు సంభవించాయని నాసా తాజాగా పేర్కొంది.
భూమి మీదే కాదు.. ఇతర గ్రహాలపైన కూడా భూకంపాలు వస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్ 18న అంగారక గ్రహంపై ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ఈనెల 18న ప్రకంపనలు సంభవించాయని నాసా తాజాగా పేర్కొంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై ఈ ప్రకంపనలను గుర్తించింది. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. కాగా 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు ఎక్కువ అని నాసా తెలిపింది. అంతేకాదు ఇన్‌సైట్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి 8,500 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.
అంత దూరంలో వచ్చిన ప్రకంపనలను ఇన్‌సైట్ గుర్తించడం ఇదే తొలిసారి. 2018, మార్చిలో మార్స్‌పై దిగిన ఈ ఇన్‌సైట్ ల్యాండర్ ఇప్పుడు భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో ఉంది. సాధారణంగా రాత్రి పూట, గాలులు తక్కువగా ఉన్న సమయంలో ఇన్‌సైట్‌లోని సీస్మోమీటర్ ఈ మార్స్ ప్రకంపనలను గుర్తించేది… అయితే ఈసారి మాత్రం పగటి సమయంలోనే రికార్డ్ చేసింది.
దాదాపు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన రెడ్ ప్లానెట్ రహస్యాల శోధన కోసం ఇన్‌సైట్ రూపొందించారు. ఇది మొదటి సమగ్ర తనిఖీ. అంగారక గ్రహం “అంతర్గత అంతరిక్షం”-దాని క్రస్ట్, మాంటిల్, కోర్ లోతుగా అధ్యయనం చేసిన మొదటి బాహ్య అంతరిక్ష రోబోటిక్ ఎక్స్‌ప్లోరర్ ఇది. ల్యాండర్ 2018 లో గమ్యాన్ని చేరుకుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Birthday Party Video: నటి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి… కొంచెమైతే ఏమయ్యేదో.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)
Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

