Train Two Parts Video: రెండుగా విడిపోయిన రైలు బోగీలు..! కామారెడ్డిలో షాకింగ్..వైరల్ అవుతున్న వీడియో..
వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్, బోగీలు విడిపోయి వెళ్లిపోయిన ఘటనలు చూశాం. ఇంజన్ నుంచి విడిపోవడంతో బోగీలు ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతాల్లో నిలిచిపోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది...
వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్, బోగీలు విడిపోయి వెళ్లిపోయిన ఘటనలు చూశాం. ఇంజన్ నుంచి విడిపోవడంతో బోగీలు ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతాల్లో నిలిచిపోయిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రమాదం జరిగింది మాత్రం గూడ్స్ రైలుకి..
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి వెనక ఉన్న కంటైనర్లు విడిపోయిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కామారెడ్డి రైల్వే గేటు వద్దకు వచ్చే సరికి బోగీలకు ఉన్న లింకులు ఊడిపోయాయి. దీంతో ఇంజిన్‌తో కొన్ని బోగీలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. గూడ్స్ రైలు బోగీల మధ్య క్లిప్ ఊడిపోవడంతో గూడ్స్ రైలు రెండుగా విడిపోయింది…గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలును నిలిపివేసి మరమ్మతులు నిర్వహించారు. సుమారు అరగంట సేపు రైలు నిలిచిపోయింది. గూడ్స్ బోగీలు విడిపోయిన ఘటనను అధికారులు, సిబ్బంది వెంటనే గుర్తించి స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Perni Nani-pawan kalyan: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన పేర్ని నాని..(లైవ్ వీడియో)
Bigg Boss 5 Telugu: షణ్ను నోటి దూల తీర్చిన నాగ్..! | అందర్నీ ఉతికిపారేసిన పవన్..(లైవ్ వీడియో)
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

