women MP’s in Araku video: రోకలి దంచుతూ..వనదేవతకు పూజలు చేస్తూ.. తిరగలి తిప్పిన మహిళా ఎంపీలు..(వీడియో)
ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలను గుర్తు పట్టారా? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. వీరిలో ఇద్దరు మన తెలుగు వాళ్లే. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్. ఇలా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు...
ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలను గుర్తు పట్టారా? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. వీరిలో ఇద్దరు మన తెలుగు వాళ్లే. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్. ఇలా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో సామలు దంచుతూ.. కాసేపు సరదాగా సరదాగా సందడి చేశారు…
విశాఖ జిల్లా అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని ” గిరి గ్రామ దర్శన్ “ను ఎంపీలు సందర్శించారు. గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు ఎంపీలు పాల్గొన్నారు.గిరి గ్రామదర్శిని గురించి.. అక్కడ సాంప్రదాయాల గురించి ఎంపీ మాధవి సహచర ఎంపీలకు వివరించారు. అక్కడే రోకలి దంచుతూ.. తిరగలి తిప్పారు. వనదేవతకు పూజలు చేశారు.కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ ” గిరి గ్రామ దర్శన్ ” ముఖ్య ఉద్దేశమని అరకు ఎంపీ మాధవి తెలిపారు. కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు ఎంపీ మాధవి. గిరి గ్రామదర్శినిని సందర్శించడం కొత్త అనుభూతిని కలిగించిందన్నారు ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్.
మరిన్ని చదవండి ఇక్కడ : Donkeys marriage Video: వర్షాల కోసం గాడిదలకు వివాహం..! కర్నూలు జిల్లాలో వింత ఆచారం..వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: వింత బిల్వం.. వర్షం ఎక్కడ నుంచి వస్తుందో గుర్తుపట్టండి..?(వీడియో)