Birthday Party Video: నటి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి… కొంచెమైతే ఏమయ్యేదో.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. కొంచెం అలర్ట్‌గా ఉన్నట్లయితే పెను ప్రమాదాలను కూడా తప్పించుకోవచ్చు. తాజాగా ఒక అమెరికాకు చెందిన నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి ప్రమాదమే జరిగింది.
నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. కొంచెం అలర్ట్‌గా ఉన్నట్లయితే పెను ప్రమాదాలను కూడా తప్పించుకోవచ్చు. తాజాగా ఒక అమెరికాకు చెందిన నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి ప్రమాదమే జరిగింది. అయితే తృటిలో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ది సింపుల్ లైఫ్’ టెలివిజన్ సిరీస్‌లో నటించిన ప్రముఖ అమెరికన్ రియాలిటీ స్టార్ నికోల్ రిచీ తన 40వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్ 21న జరుపుకున్నారు. అయితే కేక్ కట్ చేసే ముందు క్యాండిల్స్‌ను నోటితో ఊది ఆర్పే టైంలో అనుకోకుండా ఆమె తలవెంట్రుకలకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఈ హఠాత్ పరిణామానికి భయపడిన ఆమో భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే తన చేతులతో ఆ మంటలను ఆర్పేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు నికోల్ రిచీ. దీనికి సంబంధించిన వీడియోను నికోస్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘వెల్ సోఫార్ 40 ఈజ్ ’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో హ్యాపీ బర్త్‌డే కుజ్, మీరు బాగున్నారా? అంటూ స్నేహితులు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)
Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

