AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ... తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)

Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)

Anil kumar poka
|

Updated on: Sep 26, 2021 | 8:51 PM

Share

అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అమ్మ స్థానాన్ని మరే బంధం భర్తీ చేయలేదు. తల్లి తన బిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. అవసరమైతే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు.

అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అమ్మ స్థానాన్ని మరే బంధం భర్తీ చేయలేదు. తల్లి తన బిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. అవసరమైతే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక తల్లి తన ప్రాణాలను ఫనంగా పెట్టి బిడ్డను కాపాడుకుంది.

ఒక మహిళ తన చిన్న పిల్లవాడితో కలిసి ఒక గోడ దగ్గర కూర్చుని ఉంది. సడన్‌గా గోడ కూలి వారిపై పడిపోయింది. ప్రమాదాన్ని ముందే గమనించిన మహిళ వెంటనే అలర్ట్‌ అయి ఇటుకలు తన బిడ్డపైన పడకుండా అడ్డుగా నిలబడి కాపాడుకుంది. ఇటుకలన్నీ తల్లిపైన పడటంతో బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చి బిడ్డను తీసుకుంటాడు. తర్వాత మహిళ ఇటుకలను తప్పించుకుని బయటకు వస్తుంది. తల్లీ బిడ్డలు ఇద్దరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ప్రపంచానికి ఇలాంటి తల్లులు కావాలి అంటూ క్యాప్షన్‌ జోడించారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అనేకమంది లైక్స్‌తో, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)

 Train Two Parts Video: రెండుగా విడిపోయిన రైలు బోగీలు..! కామారెడ్డిలో షాకింగ్..వైరల్ అవుతున్న వీడియో..

  Perni Nani-pawan kalyan: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన పేర్ని నాని..(లైవ్ వీడియో)

Bigg Boss 5 Telugu: షణ్ను నోటి దూల తీర్చిన నాగ్..! | అందర్నీ ఉతికిపారేసిన పవన్‌..(లైవ్ వీడియో)