Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 26, 2021 | 9:49 PM

అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ పరార్‌. అంతటి బలశాలి అయిన సింహంతో పెట్టుకోడానికి ఏ జంతువూ సాహసించదు. కానీ ఇక్కడొక తాబేలు సింహానికి చుక్కలు చూపించింది.

అడవికి రాజు సింహం. ఇది జగమెరిగిన సత్యం. మృగరాజు గర్జన దూరం నుంచి వినబడితే చాలు.. మిగతా జంతువులన్నీ పరార్‌. అంతటి బలశాలి అయిన సింహంతో పెట్టుకోడానికి ఏ జంతువూ సాహసించదు. కానీ ఇక్కడొక తాబేలు సింహానికి చుక్కలు చూపించింది. తాబేలేంటి.. సింహానికి చుక్కలు చూపించడమేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి మీకు అసలు విషయం అర్ధమవుతుంది.

ఓ సింహం ఓనది దగ్గరకి నీళ్లు తాగడానికి వచ్చింది. ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఎక్కడ నుంచో ఓ తాబేలు దాని దగ్గరకు వచ్చింది. తనమానాన తను నీళ్లు తాగుతున్న సింహాన్ని నీళ్లు తాగకుండా అడ్డుపడుతోంది. పాపం సింహం అక్కడినుంచి వెళ్ళిపోయి వేరేచోట నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. అక్కడకూడా తాబేలు అడ్డుకుంది. సింహం ఎక్కడికి వెళ్తే.. తాబేలు అక్కడికి వస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ అద్భుతమైన వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-షేర్లతో హోరెత్తిస్తున్నారు. ”సింహంతోనే పరాచకాలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియోను మీరూ చూసేయండి..


మరిన్ని చదవండి ఇక్కడ : YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)

 Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్‌ హల్‌చల్‌.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్‌..!(వీడియో)

 Elephant Video: అయ్యోపాపం..మహానదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.. తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది..(వీడియో)

 vaccination Video: వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్