ఈసారి బిగ్ బాస్ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?
అసలు బిగ్‌బాస్‌కు ఏమైంది ? ఈసారి ఆటపై పెద్ద బాస్‌కు ఇంట్రెస్ట్ లేదా ? షోపై ఆసక్తి చూపించడం లేదా ? కంటెస్టెంట్స్ తీరుపై ఎందుకు ఇప్పటికీ నోరు మెదపడం లేదు ? అనే సందేహాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా బిగ్‌బాస్ ఇంట్లోకి రావడానికి ముందే షో నియమ నిబంధనల గురించి కంటెస్టెంట్స్‌కు తెలియజేస్తుంటారు. అందులో ఒకటి కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనేది. ఒకవేళ ఇంట్లోకి వచ్చాక కూడా సభ్యులు ఇంగ్లీష్, హిందీ మాట్లాడితే కచ్చితంగా హెచ్చరిస్తారు. కానీ ఈసారి సీజన్ 5 ప్రారంభమై… మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కంటెస్టెంట్స్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ ఇష్టానుసారంగా ఇంగ్లీష్, హిందీలోనే మాట్లాడుతున్నారు. ఒక్క పదం అంటే ఏమో అనుకోవచ్చు.. కానీ ఇద్దరి మధ్య సంభాషణ జరగాలంటే.. ఇంగ్లీష్, హిందీనే ఎంచుకుంటున్నారు. దీంతో వారు మాట్లాడేది అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ ఒక్కసారి చెప్పండి… నాగార్జున సర్ మీరైన గుర్తుచేయండి ఇది తెలుగు షో అంటూ సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోస్తున్నారు.
అలాగే కంటెస్టెంట్స్ సభ్యులు ఎక్కువగా బూతులు మాట్లాడేస్తున్నారు.. దీంతో ప్రతిసారీ బీప్ సౌండ్ వెయాల్సి వస్తుందనేది మరో వాదన. ఇవే కాకుండా.. బిగ్‌బాస్ సైతం ప్రతిసారి పప్పులో కాలేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు. ఇంతకు ముందు సీజన్లలో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోతోనే ఆసక్తిని కలిగించేవాడు… కానీ ఈసారి అలా జరగడం లేదని చూస్తున్న ప్రేక్షకులంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : RS.2 crore For Haircut Video: హెయిర్‌కట్‌లో పొరపాటు..రూ.2 కోట్లు నష్టపరిహారం..! వైరల్ గా మారిన వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

