Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)

Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 27, 2021 | 11:06 AM

బిగ్ బాస్ హౌస్‌లో లవ్ స్టోరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అబ్బాయిలంతా అమ్మాయిలను ఇంప్రస్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న వాళ్ళు తమ లవ్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ఒకొక్కరు తమ ప్రేమ గాధలను తెలిపారు. ఈ క్రమంలో సిరి చెప్పిన తన ప్రేమ కథ అందరిని ఆకట్టుకుంది.

పదవ తరగతిలో ప్రేమించి అబ్బాయితో వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది సిరి. తన ప్రేమ కథను పంచుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ‘నా ఫస్ట్ లవ్ పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అంటారు.. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. మా ఇంటి ఎదురింటిలోనే అతను ఉండేవాడు. ఓ రోజు అతను నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఓకే చెప్పేశా.. అయితే తను చాలా పొసిసివ్.. ఎలాగంటే నేను కనీసం కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయం పై మా మధ్య పెద్ద గొడవ కూడా అయ్యింది. ఆ టైమ్ లో నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. అతని మీద కోపంతో నేను ఒప్పేసుకున్నాను. అయితే రేపు ఎంగేజ్‌మెంట్ అనగా తను నా దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ.. నా కాళ్లపై పడిపోయి నాకు నువ్ కావాలి.. నువ్ లేకుండా ఉండలేను. అంటూ ఏడ్చేశాడు. కాని ఆ మరుసటి రోజే ఓ ప్రమాదంలో చనిపోయాడు” అంటూ బోరున ఏడ్చేసింది సిరి.

ఇక ఈ స్టోరీ విన్న హౌస్‌లోని మిగతా కంటెంస్టెంట్లు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. సిరిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు. మొత్తానికి బిగ్ బాస్‌ తాజా ఎపిసోడ్‌తో అటు కంటెస్టెంట్స్ పర్సనల్ విషయాలను బయటికి తీసి అందర్నీ సెంటీ చేశాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..

 Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

 police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

 ఈసారి బిగ్ బాస్‌ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?