Cyber Crime: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి, రూ. 64 లక్షలు స్వాహా..
Cyber Crime: పెరుగుతోన్న టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడో నాలుగు గోడల మధ్య కూర్చొని మన ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కంటికి కనిపించకుండానే...
Cyber Crime: పెరుగుతోన్న టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడో నాలుగు గోడల మధ్య కూర్చొని మన ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కంటికి కనిపించకుండానే లక్షల రూపాయలను కొట్టేస్తున్నారు. వ్యక్తిగతంగా యూజర్లను టార్గెట్ చేస్తూ వస్తోన్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఏకంగా ఓ బడా కంపెనీకే టోకరా కొట్టారు. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఖాతా నుంచి రూ. 64.11 లక్షలు ట్రాన్సఫర్ చేయించుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ నిర్మాణ సంస్థకు అవుటర్ హార్బ్ నిర్మించేందుకు ఇండియన్ నేవీ నుంచి కాంట్రాక్ట్ దక్కింది. ఇందుకు అవసరమయ్యే ముడి సరుకులతో పాటు, నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం లండన్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సదరు లండన్ కంపెనీ ఖాతాలో రూ. 64.11 లక్షలను జమ చేసింది. రెండు రోజుల క్రితం లండన్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి.. ‘ఇంకా డబ్బు ఎందుకు పంపలేదు’ అని ప్రశ్నించారు. అయితే తమ ఖాతాలో ఉన్న డబ్బును ఎవరో కాజేశారని గ్రహించిన నిర్మాణ సంస్థ వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మెయిల్‌ను హ్యాక్ చేయడం ద్వారా కేటుగాళ్లు డబ్బులు కాజేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఢిల్లీ కేంద్రంగా కొందరు నైజీరియన్లు హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ కంపెనీల మెయిళ్లను హ్యాక్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారని తాజా వ్యవహారంలో బంజారహిల్స్‌లోని నిర్మాణ సంస్థతో పాటు, లండన్ సంస్థ మెయిళ్లనూ హ్యాక్ చేసి డబ్బులు కొట్టేశారని పోలీసులు తేల్చారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..