Telangana: వామ్మో! చూడ్డానికి ఇలా ఉంది కానీ పెద్ద నంగనాచి.. భర్తను చంపి కొత్తింట్లో పాతి పెట్టేసింది

ఏ క్రైమ్ కహానికి లీడ్ వెతికినా తేలేది అక్రమ సంబంధమే. తాజాగా ఓ వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ కూడా అలాంటి క్లైమాక్స్‌కే తెరతీసింది. వివాహిత ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసింది.

Telangana: వామ్మో! చూడ్డానికి ఇలా ఉంది కానీ పెద్ద నంగనాచి.. భర్తను చంపి కొత్తింట్లో పాతి పెట్టేసింది
Wife Kills Husband
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 07, 2022 | 1:48 PM

Crime News: అక్రమ సంబంధాలన్నీ హత్యలతో, ఆత్మహత్యలతో ముగియడం పరిపాటిగా మారింది. తాజాగా కామారెడ్డి జిల్లా(kamareddy district) ఎల్లారెడ్డి(yellareddy)లో వెలుగుచూసిన హత్య మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. చూడటానికి అమాయకంగా కనిపించే మహిళ ప్రియుడి సాయంతో భర్తను హత్యచేసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల రమేశ్‌ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రమేశ్‌ భార్య పేరు వెన్నెల, ఆమె వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వికారాబాద్‌కు చెందిన దస్తప్ప అనే వ్యక్తితో రమేశ్‌ భార్యకు అక్రమ సంబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన వెన్నెల, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది.

ఎనిమిది రోజుల క్రితం హత్య జరిగినట్టు తెలుస్తోంది. భర్తను చంపి నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే పాతి పెట్టారు. పోలీసుల విచారణలో భార్య, ప్రియుడు హత్య చేసినట్టు అంగీకరించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఆ ఇంట్లో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు. నిందితులిద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే