Andhra Pradesh: బయటకు రాగానే మిమ్మల్నందరినీ చంపేస్తాడు.. సుబ్రమణ్యంకు అనంతబాబు కుటుంబసభ్యుల వార్నింగ్

సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu) కుటుంబసభ్యులు కఠినంగా వ్యవహిస్తున్నారు. బాధితులను చంపేస్తామని బెదించడంతో సుబ్రమణ్యం ఫ్యామిలీ మెంబర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. మర్డర్‌ కేసులో అరెస్టై..

Andhra Pradesh: బయటకు రాగానే మిమ్మల్నందరినీ చంపేస్తాడు.. సుబ్రమణ్యంకు అనంతబాబు కుటుంబసభ్యుల వార్నింగ్
Anantha Babu
Follow us

|

Updated on: Jul 07, 2022 | 7:17 AM

సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu) కుటుంబసభ్యులు కఠినంగా వ్యవహిస్తున్నారు. బాధితులను చంపేస్తామని బెదించడంతో సుబ్రమణ్యం ఫ్యామిలీ మెంబర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. మర్డర్‌ కేసులో అరెస్టై, జైలుకెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగారు. హత్యకు గురైన సుబ్రమణ్యం ఫ్యామిలీ మెంబర్స్‌పై అనంతబాబు తల్లి, అక్క దౌర్జన్యానికి దిగారు. అనంతబాబు జైల్లో నుంచి రాగానే మిమ్మలనందరినీ చంపేస్తాడంటూ వార్నింగ్‌ ఇవ్వడంతో వాళ్లంతా హడలిపోయారు. కాకినాడ (Kakinada) భానుగుడి శంకర్‌ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యం బాబాయ్‌ శ్రీనును బెదిరించారు అనంతబాబు తల్లి, అక్క. కారులో అక్కడికొచ్చి శ్రీనుతోపాటు అతని భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులపై బూతుపురాణం అందుకున్నారు. అనంతబాబు త్వరలోనే బెయిల్‌పై వస్తాడని, వచ్చాక మీ అంతు చూస్తాడంటూ బెదిరించారు. దాంతో, బాధితుడు శ్రీను పోలీసులను ఆశ్రయించాడు. అనంతబాబు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమను దారుణంగా తిడుతున్నారని, చంపేస్తామని అంటున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

కాగా దళిత సంఘాల నాయకులు వాచ్‌మన్‌ శ్రీనుకు అండగా నిలబడ్డారు. కుటుంబ సభ్యులను తీసుకెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇప్పించారు. వాచ్‌మన్‌ శ్రీను కంప్లైంట్‌పై కాకినాడ టూటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతబాబు కుటుంబ సభ్యుల బెదిరింపులపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటన కాకినాడ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మే 19న కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధి వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సుబ్రహ్మణ్యం.. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. అయితే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనంతబాబు వచ్చి ఆయన కారులోనే తమ అబ్బాయిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అర్ధరాత్రి 1 గంటల సమయంలో మీ అబ్బాయి టిఫిన్‌ కోసం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడని, డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ చెప్పారని బాధిత కుటంబ సభ్యులు తెలిపారు. అయితే అనంతబాబు తిరిగి వెళ్తుండగా అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.