Crime News: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం..
Girl molested by constable: తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేసేందుకు
Girl molested by constable: తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక కేకలు వేయడంతో.. స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కానిస్టేబుల్‌ను చేవేళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
శంకర్‌పల్లికి చెందిన వడ్డే శేఖర్ హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న వడ్డే శేఖర్.. తన ఇంటి పక్కనే ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు. కానిస్టేబుల్ శేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: